రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్


బీహార్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన జరిగింది. ఓ సెక్యూరిటీ గార్డు గాయపడిన రోగికి కుట్లు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బాగా సబ్-డివిజనల్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఒక టెంపో, పికప్ వ్యాన్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం బాగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో డాక్టర్‌కు బదులుగా, ఒక సెక్యూరిటీ గార్డు రోగికి కుట్లు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. తమకు సెక్యూరిటీ గార్డే కుట్లు వేశాడని గాయపడిన ఇద్దరు తెలిపారు. శిక్షణ లేని వ్యక్తితో చికిత్స చేయించడం తీవ్ర నిర్లక్ష్యమని, ఇది తమ ప్రాణాలకే ప్రమాదమని వారు ఆవేదనతో అన్నారు. ఘటనపై తీవ్ర దుమారం రేగిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చాలాకాలంగా సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగిన రోజు ఒకేసారి చాలా మంది రోగులు రావడంతో, ఒకరికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో డాక్టర్ పర్యవేక్షణలోనే సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకున్నామని వివరించారు. ఈ ఘటన బీహార్ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని ఆరోగ్య విభాగాల్లో 49% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సి ఉండగా, బీహార్‌లో 2,148 మందికి ఒకరే ఉన్నట్లు కాగ్‌ నివేదిక బయటపెట్టింది. తాజా ఘటనతో రాష్ట్రంలో వైద్య సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని కొందరు విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

సారీ హేమక్కా.. తప్పు చేశాను.. తమన్నా క్షమాపణ వైరల్ వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *