Crime News : 19 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది.. అంతలోనే చేయకూడని పని చేసింది.. కట్‌చేస్తే..

Crime News : 19 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది.. అంతలోనే చేయకూడని పని చేసింది.. కట్‌చేస్తే..


అప్పుడే పుట్టిన పసికందును ఓ యువతి గొంతు కోసి హత్య చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. నగరంలోని దేవనహళ్లిలో ఉన్న ఫాక్స్‌కాన్‌కు చెందిన ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఓ 19 ఏళ్ల యువతి ఇటీవల కంపెనీలోని టాయిలెట్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే ఎవరికీ తెలియకుండా బిడ్డను అతికిరాకతంగా గొంతుకోసం హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి బయటకు పడేసింది.

అయితే కంపెనీలో సమీపంలో సంచిలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశించారు. దీంతో ఓ యువతి బిడ్డను సంచిలో చుట్టి పడేసినట్టు గుర్తించారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన యువతికి ఇంకా పెళ్లి కాలేదని.. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతోనే చిన్నారిని హతమార్చి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.

మధ్య ప్రదేశ్‌లో మరో దారుణం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో ఒక పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. జిల్లా ఆసుపత్రి దారిలో రాకపోకలు సాగిస్తున్న స్థానికులపై ఆ పిచ్చి కుక్క విరుచుకు పడింది. ఈ పిచ్చికుక్క దాడిలో ఇప్పటి వరకు సుమారు 40 మంది గాయపడగా, వారందరూ ప్రస్తుతం సత్నా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడిలో గాయపడిన సుందర్‌లాల్ సాకేత్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. తాను టీ కొనడానికి వెళ్లిన సమయంలో ఒక కుక్క ఒక్కసారిగా తనపై దాడి చేసిందని.. తాను ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకున్నానని, ఆ తర్వాత ఆ కుక్క తన కళ్లముందే మరో 8-10 మందిని కరిచిందని చెప్పుకొచ్చాడు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో కుక్కల బెడదను తగ్గించాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *