Chalaki Chanti: నా తర్వాత వచ్చిన సుడిగాలి స్టార్ అయ్యాడు !! కానీ నేను..

Chalaki Chanti: నా తర్వాత వచ్చిన సుడిగాలి స్టార్ అయ్యాడు !! కానీ నేను..


జబర్దస్త్ తో పాపులర్ అయిన వారిలో చలాకీ చంటి ఒకరు. తన కామెడీ టైమింగ్, పంచులతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ కమెడియన్. అయితే జబర్దస్త్ కు రాకముందే నాని కబడ్డీ వంటి పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా చేశాడు చంటి. అలాగే రేడియో మిర్చిలో ఆర్జేగా నూ చేశాడు. అక్కడ నిర్వహించిన చంటి బంటి కార్యక్రమంతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ప్రోగ్రామ్ కారణంగానే అతనికి చంటి పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టి మరింత ఫేమస్ అయ్యాడు. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఓవైపు జబర్దస్త్ లాంటి టీవీ షోస్ చేస్తూనే సినిమాల్లోనూ నటించాడు చలాకీ చంటి. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ గానూ పార్టిసిపేట్ చేశాడు. మధ్యలో అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ మళ్లీ ఇప్పుడు బుల్లితెరపై బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన చంటి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే సుడిగాలి సుధీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరిని అడగలేదని చెప్పిన చంటి… అయితే తనకు చాలా సందర్భాల్లో నిరాశలు ఎదురయ్యాయిని ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ తన సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలనే నమ్మకంతోనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్లా అన్నాడు. అయితే తన నటనను ఇతరులతో పోల్చి చూడడం తనకు చాలా బాధ కలిగిస్తుందని చంటి చెప్పుకొచ్చాడు. ఆత్మగౌరవం విషయంలో తాను ఎప్పుడూ రాజీ పడలేదని.. తన విలువలను తాను ఎప్పుడూ కాపాడుకుంటా అన్నాడు. ఇక తన తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు స్టార్ రేంజ్ కు ఎదగడం చూసి చాలా సంతోషంగా ఫీలయ్యా అంటూ చెప్పుకొచ్చాడు.అయితే తాను చేసిన తప్పులు వాళ్లు చేయకూడదని గతంలో సుధీర్‌కు వ్యక్తిగతంగా సలహా కూడా ఇచ్చానంటూ చంటి చెప్పుకొచ్చాడు. మంచి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినియోగించుకోవాలని.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఎత్తుకు వెళ్లొచ్చని తాను సుధీర్ కు చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు చంటి.అంతేకాదు భవిష్యత్తులో సుధీర్ ఇంకా ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Assi Movie Review: మంచి కోర్టు రూమ్ డ్రామా..18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ

TOP 9 ET News: 80కోట్ల ఇంద్రభవనం రెడీ.. గృహప్రవేశమే తరువాయి?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *