
మండ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కాదని, అతని స్నేహితుడితోనే పారిపోయి రెండో పెళ్లి చేసుకుంది ఓ యువతి. వివాహం అయిన తర్వాత ఆ యువతి చేసిన పని తీవ్ర కలకలం రేపింది.
కర్ణాటకలోని మండ్య జిల్లా బన్నంగాడి గ్రామానికి చెందిన యువతి (24) అనే యువతి, రెండేళ్ల క్రితం సాగర్ అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో, సాగర్ స్నేహితుడు ఇంద్ర తరచూ వారి ఇంటికి వస్తుండేవాడు. ఆ క్రమంలో రక్షితకు ఇంద్రతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇంద్రపై ఉన్న మోజుతో రక్షిత తన భర్తను వదిలేసి, అతనితో కలిసి పారిపోయింది. అంతటితో ఆగకుండా, ఒక దేవాలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇంద్ర తన కాలికి మెట్టెలు పెడుతున్న ఫోటోను రక్షిత ఏకంగా తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టింది. పొద్దున్నే లేచి భార్య స్టేటస్ చూసిన సాగర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. తన కళ్లముందే తన స్నేహితుడినే పెళ్లాడటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు.
కేవలం పారిపోవడమే కాకుండా, ఇంట్లో ఉన్న రూ. లక్ష నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా రక్షిత తీసుకువెళ్లిందని సాగర్ ఆరోపిస్తున్నాడు. దీంతో బాధితుడు మండ్య గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. “నాకు ఆమె నుండి విడాకులు ఇప్పించాలని, తీసుకువెళ్లిన నగదు, బంగారాన్ని వెనక్కు ఇప్పించాలని” సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడే భార్యను తీసుకెళ్లడం, అది స్టేటస్ ద్వారా తెలియడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..