Tamil Nadu Election 2026: ఓటేసిన సెలబ్రెటీలు.. తమిళనాట కొనసాగుతున్న పోలింగ్

Tamil Nadu Election 2026: ఓటేసిన సెలబ్రెటీలు.. తమిళనాట కొనసాగుతున్న పోలింగ్


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరాయి. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరుగుతుంది. పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్ని కల్లో పోటీ చేస్తున్న దళపతి విజయ్ చెన్నై పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓటువేశారు. వీరితోపాటు స్టార్ హీరో అజిత్, స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పోలింగ్ బూతుల్లో క్యూ కట్టి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌కు గానూ 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి దళపతి విజయ్ పోటీ చేస్తుండటంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.

ఇవి కూడా చదవండి

 భార్యతో కలిసి ఓటువేయడానికి వచ్చిన హీరో శివకార్తికేయన్ 

ఓటు వేసి ఇంక్ మార్క్ చూపిస్తున్న దర్శకుడు అట్లీ

ఓటు వేసిన హీరో అజిత్ ..

ఓటు హక్కు వినియోగించుకున్న నటి త్రిష

ఓటు హక్కు వినియోగించుకున్న ఇళయ రాజా..

ఓటువేసి దళపతి విజయ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *