అక్కినేని నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఏదంటే టక్కున గుర్తొచ్చే సినిమా ‘హలో బ్రదర్’. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మార్కు వినోదం, నాగార్జున ద్విపాత్రాభినయం వెండితెరపై మ్యాజిక్ చేశాయి. అయితే, ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, బాక్సాఫీస్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ చిత్రం కథ మొదట మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్ళింది. అయితే అప్పటికే తాను కవలల కథలు చాలా చేశానని ఆయన తిరస్కరించడంతో, ఈ అవకాశం నాగార్జునను వెతుక్కుంటూ వచ్చింది. నాగార్జున ఇందులో ‘దేవా’ అనే ఊర మాస్ దొంగగా, ‘రాజా’ అనే పాప్ సింగర్‌గా రెండు భిన్నమైన పాత్రల్లో జీవించారు. దేవా పాత్రలో ఆయన చూపించిన మేనరిజమ్స్ మాస్ ప్రేక్షకులను ఊరూతలూగించాయి. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య నటించగా, బ్రహ్మానందం కామెడీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
1994 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అగ్నిపర్వతంలా పేలింది. అంతకుముందు నాగార్జున నటించిన ‘గోవిందా గోవిందా’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేవు. కానీ థియేటర్లలోకి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. హైదరాబాద్‌లోని దేవీ థియేటర్‌లో అప్పట్లో ‘రోజా’ నెలకొల్పిన వసూళ్ల రికార్డులను ఇది తుడిచిపెట్టేసింది. అక్కడ వరుసగా 120 ఆటలు హౌస్‌ఫుల్ కావడం ఒక సంచలనం. విజయవాడ అప్సర థియేటర్‌లోనూ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచి నాగార్జునను బాక్సాఫీస్ కింగ్‌గా నిలబెట్టింది.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..