పై ఫొటోలో రాఘవ లారెన్స్ తో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఒక ఫేమస్ హీరో. అంతేకాదు డైరెక్టర్ కూడా. ఇంకా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని ఈ యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ తో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే ధనుష్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా ధనుష్ తో కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కట్ చేస్తే.. ఆ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా సెన్సేషన్ అయ్యాడు. అది కూడా మొదటి సినిమాతోనే . ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తన మొదటి మూవీకి తనే దర్శకత్వం వహించాడు. అలాగే లిరిసిస్ట్ గా కూడా చేశాడు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.
ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో లారెన్స్ తో ఉన్నది మరెవరో కాదు యూత్ మూవీ హీరో కెన్ కరుణాస్. అసురన్, వాతి (తెలుగులో సార్), విడుదలై సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కెన్ కరుణాస్ కు యూత్ మొదటి సినిమా కావడం గమనార్హం. అయితేనేం తన నటనతో అదరగొట్టేశాడు. ముఖ్యంగా యూత్ కు ఇప్పుడు ఫేవరెట్ గా మారిపోయాడీ హీరో. అన్నట్లు కెన్ కరుణాస్ తండ్రి పేరు కూడా కరుణాస్. ఆయన కూడా పలు సినిమాల్లో నటుడిగా, కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కెన్ కరుణాస్. యూత్ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ అందుబాటులో ఉంది. మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ చూడాలనుకునేవారికి యూత్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో యూత్ సినిమా..
This Ken is everything 😉
Watch Youth, out now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#YouthOnNetflix pic.twitter.com/a514NiRUAE— Netflix India South (@Netflix_INSouth) April 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.