Ashwini Sree: ఈ బాధ భరించలేకున్నా.. కన్నీరుమున్నీరైన బిగ్ బాస్ అశ్విని శ్రీ.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

Ashwini Sree: ఈ బాధ భరించలేకున్నా.. కన్నీరుమున్నీరైన బిగ్ బాస్ అశ్విని శ్రీ.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?


బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్విని శ్రీ ఒకరు. కెరీర్ ప్రారంభంలో పలు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. విజేతగా నిలవకపోయినా తన అందం, ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అశ్విని శ్రీకి సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చాయి. అలాగే పలు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన అన్ని విషయాలను అందులోనే షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది అశ్విని శ్రీ. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ బాగా ఎమోషనలైంది.

‘నేను నా సోను బాయ్‌ని కోల్పోయా.. ఈ బాధ భరించలేకపోతున్నా. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా రెగ్యూలర్ గా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వాటికి ఏవైనా సమస్యలు ఉన్నా అవి మనకు చెప్పలేవు. సోను బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అశ్విని శ్రీ.

ఇవి కూడా చదవండి

అశ్విని శ్రీ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో ఇదిగో..

ఈ బిగ్ బాస్ బ్యూటీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

అశ్విని శ్రీ మరిన్ని ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్, వీడియోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *