Headlines

Actress : స్టార్ హీరోతో లవ్ బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..

Actress : స్టార్ హీరోతో లవ్ బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..


ఆమె ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఓ స్టా్రోను ప్రాణంగా ప్రేమించింది. కానీ కొన్నాళ్లకే అతడితో బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం సైతం ఎక్కువ రోజులు సాగలేదు. చివరకు భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా లైఫ్ గడుపుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా. మనం మట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు నటాషా స్టాంకోవిచ్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 47 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యాతో వివాహం విచ్ఛిన్నమైనప్పటి నుండి, ఆమె తన కుమారుడు అగస్త్యతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నటాషాను ఫిట్‌నెస్ క్వీన్ అని కూడా పిలుస్తారు.

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

నటాషా మంగళవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఫిట్‌నెస్ స్పష్టంగా కనిపిస్తోంది. ఫోటోను షేర్ చేస్తూ, ఆమె క్యాప్షన్‌లో ‘క్రమశిక్షణే నా గర్వం’ అని రాసింది. నటాషా స్వతహాగా భారతదేశానికి చెందిన వ్యక్తి కారు. ఆమె సెర్బియా నుండి భారతదేశానికి వచ్చింది. ఎంతో కష్టపడి ఆమె ఇక్కడికి చేరుకుంది. భారతదేశానికి వచ్చిన తర్వాత, ఆమె పేరు అలీ గోనితో ముడిపడింది. ఈ సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. అలీ , నటాషా ‘నాచ్ బలియే 9’ షోలో పాల్గొన్నారు. అలీతో విడిపోయిన తర్వాత, నటాషా సీనియర్ క్రికెటర్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యాకు దగ్గరైంది. వారిద్దరూ మొదట ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

కానీ వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు సాగలేదు. కొన్నాళ్ల క్రితమే హార్దిక్, నటాషాలు విడిపోయారు. వారి వివాహ బంధం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు అగస్త్య నటాషాతో ఉన్నాడు. నటాషా ఇప్పుడు మోడలింగ్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా పనిచేస్తోంది. ఆమె ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఆమె జిమ్ నుండి ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *