అమెరికా పట్టుకున్న నౌక, చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తోంది. అందులో క్షిపణుల కోసం రసాయన సామగ్రి ఉంది. ఆగమని పదేపదే హెచ్చరించినా అది ఆగలేదని నిక్కీ హేలీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ పాలనకు చైనా మద్దతిస్తోందని ఆ వాస్తవాన్ని ఇక విస్మరించలేమని ఆమె కామెంట్ చేసారు. అమెరికా చర్యను ‘సాయుధ దోపిడీ’గా ఇరాన్ అభివర్ణించింది. దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు చర్చలకు హాజరుకామని స్పష్టం చేసింది. మరోవైపు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం ఈ నౌకలో సైనిక, పౌర అవసరాలకు వాడే ద్వంద్వ వినియోగ వస్తువులు ఉండవచ్చని అమెరికా భద్రతా వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహాయం చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా ఇప్పటికే 2019లో ఐఆర్ఐఎస్ఎల్ సంస్థపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
తాజాగా భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. దాంతో భారత్ అడ్వైజరీ జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్