Headlines

సునామీ అలర్ట్‌! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

సునామీ అలర్ట్‌! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!


40 నిమిషాల తర్వాత ఇవాటె పోర్ట్‌ను సునామీ తాకింది. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసారు. సముద్ర అలలు భారీ ఎత్తున ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున తక్షణమే తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని యంత్రాంగం ఆదేశించింది. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువ కావడం ప్రజలను భయపెట్టింది. భూకంప కేంద్రం సముద్ర గర్భంలో ఉండటం వల్ల ముప్పు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపడుతూ జపాన్ ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి ప్రకంపనలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విస్తరించాయి. టోక్యోలోని ఎత్తైన కట్టడాలు ఆ ధాటికి కదిలిపోయాయి. రైలు విమాన సర్వీసుల్ని నిలిపేసారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో వేలాది ఇళ్లు అంధకారంలో మునిగిపోయాయి. అణు విద్యుత్ కేంద్రాల వద్ద పరిస్థితిని నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టంపై స్పష్టమైన సమాచారం రాకపోయినప్పటికీ, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా.

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *