తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం..ఇటు వడగళ్ల వాన, అటు వడగాల్పుల సెగ!

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం..ఇటు వడగళ్ల వాన, అటు వడగాల్పుల సెగ!


ద్రోణి ప్రభావంతో అటు తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఉక్కపోత, వడగాలులతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుంటే.. అక్కడక్కడా పిడుగుల భయం వెంటాడుతోంది.ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఎండలకు తోడు.. 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 29 మండలాల్లో సాధారణ వడగాల్పుల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలుంటాయని, అనకాపల్లి, మన్యం జిల్లాల్లోనూ ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని సూచించింది. కాగా, ద్రోణి ప్రభావంతో మన్యం, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని , పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధఇకారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *