Personality Test: మీ చిటికెన వేలు ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే?

Personality Test: మీ చిటికెన వేలు ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!  ఎలా అంటే?


సాధారణంగా ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే అతని ప్రవర్తన లేదా మాటతీరును బట్టి అంచనా వేస్తాం. లేదా జోతిష్యం శాస్త్రం, అరచేతిలోని రేఖల ఆధారంగా తెలుసుకుంటాం. కానీ సముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీర భాగా నిర్మాణం, వాటి పరిమాణం వంటి అంశాలు కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి చెబుతాయని చాలా కాలంలో నమ్మకం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి చిటికెన వేలు, దాని పొడవు, స్థానం అతను ఎలాంటి వాడోనని తెలియజేస్తుందట.ఇది శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా చాలా మంది వీటిని నమ్ముతారు. కాబట్టి మీ చిటికెన వీలే మీ గురించి ఏం చెప్తుందో చూద్దాం.

మీ చిటికెన వేలు ఆకారాన్ని వ్యక్తి ఎలా అంచనా వేయాలో తెలుసుకోండి 

మీ చిటెకన వేలు, ఉంగరం వేలు సమానంగా ఉంటే: ఒకవేళ చిటికెన వేలు, ఉంగరపు వేలు మొదటి గీతతో సరిగ్గా ఒకే ఎత్తులో ఉంటే, మీరు చాలా స్థితప్రజ్ఞత గల వ్యక్తి అని అర్థం. ఇలాంటి వ్యక్తులకు తమ మనసుపై తమకు పూర్తి అవగాహన ఉంటుంది. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బయపడకుండా సమస్యలను పరిష్కరించుకుంటారు. తామ ఎంచుకున్న లక్ష్యాల పట్ల పట్టుదల, ఓర్పుతో పనిచేస్తారు. ఇలాటి వ్యక్తులు శారీరకంగా చురుగ్గా ఉంటూ క్రీడలు లేదా నృత్యం వంటి కళల్లో పాల్గొంటే వీరిలోని సృజనాత్మకత మరింత పెరుగుతుందట.

చిటికన వేలు గీత ఉంగరం వేలు గీత కంటే పైకి ఉంటే : చిటికెన వేలు ఉంగరపు వేలు మొదటి గీత కంటే పొడవుగా ఉంటే, మీలో సహజంగానే నాయకత్వ గుణాలు పుష్కలంగా ఉంటాయట. మీరు మీ మాటలతో సులభంగా ఇతరులను ప్రభావితం చేయగలరట. అలాగే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కవగా ఉంటుందట. మీరు చాలా చురుగ్గా ఉంటూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతుకుతారట. అయితే ఇలాంటి వ్యక్తులు కొన్నిసార్లు అహంకారం దరిచేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యమట. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులలో ప్రకృతిలో ఎక్కవ సేపు గడపడం వల్ల వారికి అది మరింత ప్లెస్ పాయింట్ అవుతుందట.

చిటికెన గీత కంటే ఉంగరపు వేలు గీత తక్కువగా ఉంటే : చిటికెన వేలు ఉంగరపు వేలు మొదటి గీత కంటే తక్కువ ఎత్తులో ఉంటే, మీరు చాలా సున్నితమైన, దయాగుణం కలిగిప వ్యక్తులని అర్థం. మీరు ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకుంటారు. మానవ సంబంధాలకు, ప్రేమకు మీరు ఎక్కువగా విలువ ఇస్తారు. అలాగే మీరు ఎప్పుడు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారు. మీలో ఉన్న ఈ సున్నితత్వ లక్షణం మంచిదే అయినా, మీ భావోద్వేగాలపై మీకు నియంత్రణ ఉండటం చాలా అవసరం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే మీ జీవితం మరింత ప్రశాంతంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మీరు పడుకునే విధానమనే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే?

అయితే మన చిటికెన వేలి ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం అనేది కేవలం ఒక సరదా, ఆసక్తికరమైన విషయం మాత్రమే. దీన్ని మనం కేవలం ఒక సూచన తీసుకోవచ్చు అంతే కానీ, మనిషి పూర్తి స్వభావం అనేది వారి ఆలోచనలు, ప్రవర్తనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని మీరు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. జస్ట్ అంచనా వేసుకోవచ్చు.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *