కొత్త టైర్లపై ఉండే ఈ రబ్బరు ముళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదేనట!

కొత్త టైర్లపై ఉండే ఈ రబ్బరు ముళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదేనట!


మనం కొత్త కారు కొన్నా లేదా కొత్త టైర్లను చూసినా, వాటి ఉపరితలంపై చిన్న రబ్బరు వెంట్రుకలు లేదా ముళ్లు కనిపిస్తాయి. వీటిని ఇంజనీరింగ్ భాషలో ‘వెంట్‌ స్ప్రూ’ (Vent Sprue) లేదా ‘టైర్ నిబ్స్’ (Tyre Nibbs) అని పిలుస్తారు. ఇవి కేవలం కొత్త టైర్లపై మాత్రమే కనిపిస్తాయి. వాహనం నడిచే కొద్దీ, కొంత కాలం తర్వాత ఈ కొమ్ములు వాటంతట అవే అరిగిపోతాయి. టైర్లను తయారు చేసేటప్పుడు వల్కనైజేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో ద్రవ రూపంలో ఉన్న రబ్బరును టైర్ ఆకారం వచ్చేలా ఒక మెటల్ అచ్చు (Mold) లోకి పంపుతారు. ఆ అచ్చులో గాలి బుడగలు ఏర్పడకుండా ఉండటానికి అక్కడక్కడా చాలా సన్నని రంధ్రాలను ఏర్పాటు చేస్తారు.

ఈ ముళ్లు ఎలా ఏర్పడతాయి?:

అచ్చులో రబ్బరు నిండేటప్పుడు, లోపల ఉన్న గాలి ఆ సన్నని రంధ్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అలా గాలి బయటకు వెళ్లే సమయంలో ఒత్తిడి వల్ల కొద్దిగా రబ్బరు కూడా ఆ రంధ్రాల గుండా బయటకు వస్తుంది. టైర్ తయారీ పూర్తయ్యాక, ఆ రంధ్రాల నుండి బయటకు వచ్చిన రబ్బరు ముళ్లు లాగా గట్టిపడి టైర్ పైన ఉండిపోతుంది. వీటినే ‘వెంట్‌ స్ప్రూ’ అంటారు.

వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయా?: ఇవి వాహనం నడిపేటప్పుడు ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కొద్ది రోజులు వాహనం నడిపిన తర్వాత రోడ్డుతో కలిగే ఘర్షణ (Friction) వల్ల అవి దానంతట అవే రాలిపోతాయి. ఈ ముళ్లు సరిగ్గా ఉన్నాయి అంటే, టైర్ తయారీ సమయంలో గాలి బుడగలు లేకుండా రబ్బరు అచ్చులో చక్కగా నిండిందని అర్థం. అంటే ఇది ఒక నాణ్యమైన టైర్ అని చెప్పడానికి ఇవి ఒక సంకేతం. పాత టైర్లకు లేదా అరిగిపోయిన టైర్లకు ఇవి ఉండవు. కాబట్టి మీరు కొనే టైర్ కొత్తదా కాదా అని తెలుసుకోవడానికి ఇది ఒక సులభమైన గుర్తు. కాబట్టి ఇకపై కొత్త టైర్లపై ఆ ముళ్లను చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అవి కేవలం తయారీలో భాగంగా ఏర్పడిన గుర్తులు మాత్రమే తప్ప, టైర్ పనితీరుతో వాటికి ఎటువంటి సంబంధం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *