Indidan Railways: రైళ్లల్లో దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన ప్రత్యేక కోచ్‌లలో ఎవరెవరు ప్రయాణించవచ్చు..?

Indidan Railways: రైళ్లల్లో దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన ప్రత్యేక కోచ్‌లలో ఎవరెవరు ప్రయాణించవచ్చు..?


దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కోచ్‌లకు సంబంధించి రైల్వే శాఖ మరోసారి నిబంధనలు జారీ చేసింది. ఈ ప్రత్యేక కోచ్‌లలో ఎవరెవరు ప్రయాణించవచ్చు..? ఎలాంటి నియమాలు ఉంటాయి..? వీటిల్లో ప్రయాణించాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి..? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? అనే దానిపై స్పష్టతిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. దివ్యాంగులు, మహిళలకు కేటాయించే ఈ ప్రత్యేక బోగీల్లో ఇతర ప్రయాణికులు ఎక్కితే ఏం చేయాలనే దానిపై కూడా వివరణ ఇచ్చింది. ఇతర ప్రయాణికులు కూడా ఈ కోచ్‌ల్లోకి ప్రవేశించి కూర్చోవడం తరచుగా జరుగుతుంది. దీని వల్ల ప్రయాణికులు అసౌకర్యాన్ని గురవుతున్నారు. ఇంతకు దీనికి సంబంధించి రైల్వేశాఖ ఏం చెప్పిందనేది చూద్దాం.

ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ట్రైన్ ముందు, వెనుక భాగంలో రిజర్వుడ్ SLRD, LSLRD కోచ్‌లు ఉంటాయి. వీటిని దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కోచుల్లో ప్రవేశించాలంటే దివ్యాంగులు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు ఉండాలి. ఇక టికెట్లపై రాయితీ సౌకర్యం ఉన్న దివ్యాంగులు కూడా వీటిల్లో ప్రయాణించవచ్చు. వికలాంగుల సాధికారిత శాఖ జారీ చేసి యూడీఐడీ కార్డు కలిగి ఉండాలి. ఇక రైల్వేశాఖ దివ్యాంగులకు అందించే రాయితీ సౌకర్యం వర్తించేవారు కూడా వీటిల్లో ప్రయాణించవచ్చు. అయితే కేవలం కార్డు ఉంటే సరిపోదు. తప్పనిసరిగా ముందుగానే టికెట్ తీసుకోవాలి. టికెట్ లేకపోతే ప్రయాణించడం వీలుకాదు.

వేరేవారు ఎక్కితే..

ఒకవేళ ఈ స్పెషల్ కోచుల్లో వేరేవారు ఎక్కితే ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. వారిపై రైల్వే చట్టం 1989లోని వివిధ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రయాణికులు వీటిల్లో ప్రయాణిస్తే రైల్వేశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఎవరికి కేటాయించిన కోచుల్లో వాళ్లు మాత్రమే ప్రయాణించాలని, ఇతర ప్రయాణికులకు అసౌకర్య కలిగిస్తే చర్యలు తీసుకుంటామని రైల్వేశాఖ హెచ్చరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *