ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న రామాయణ కోసం మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? వేల కోట్ల బడ్జెట్ వెనక్కి తీసుకొచ్చేందుకు వాళ్లేం చేస్తున్నారు..? నిజంగానే హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో డీల్ అయిందా..? ఈ ఎపిక్ సినిమాకు వార్నర్ బ్రదర్స్ గ్లోబల్ పార్ట్‌నర్ అయ్యారా..? సినిమాకాన్ వేదికగా ఈ చిత్రం సృష్టించిన సెన్సేషన్ వెనుక ఉన్న అసలు ఏంటి..? రామాయణ సినిమా బడ్జెట్ దాదాపు 4000 కోట్లు అంటూ దర్శక నిర్మాతలు ఇదివరకే తెలిపారు.. నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా రానుంది.. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. రావణాసురుడిగా యశ్.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఇటీవలే లాస్ వేగాస్‌లో ప్రతిష్టాత్మక సినిమాకాన్ 2026 వేదికపై ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించిన రామాయణ గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ విజువల్స్ చూసి ఇంప్రెస్ అయిన హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుందంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంతనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.. ఇప్పటివరకు అఫీషియల్ డీల్ జరిగిందనే దానిపై ఎక్కడా అధికారిక సమాచారం లేదు. నమిత్ మల్హోత్రా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో పాటు డినెగ్ లాంటి ఆస్కార్ విన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు కలిసి ఈ భారీ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నాయి. ప్రేక్షకులకు ఒక ప్రీమియం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం ఐమ్యాక్స్, డాల్బీ ఫార్మాట్‌లకు తగ్గట్టుగా ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో షూట్ చేస్తున్నారు. రామాయణం ఫస్ట్ పార్ట్‌ను 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..
వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త
త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు
పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’
రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?