Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే..

Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే..


పగలు అయినా.. రాత్రి అయినా.. ఆకలేస్తే వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టాల్సిందే.. వెజ్ అయినా.. నాన్‌వెజ్ అయినా.. ఇలా ఆర్డర్ పెట్టగానే.. అలా వచ్చేస్తుంది.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆ ఫుడ్ సేఫేనా.. అప్పుడే తయారు చేసిందేనా.. లేక ఎప్పటిదోనా.. వాసన, పురుగులు.. బొద్దింకలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.. హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ అంటే సౌకర్యం అనుకునే రోజులు.. ఇప్పుడు భయానకంగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన మాత్రం ఈ ఆందోళనను మరింత పెంచింది. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏ. ముత్యం రెడ్డి ఆర్డర్ చేసిన ఫుడ్.. అసలు తినలేని పరిస్థితి. గత ఆదివారం రోజున ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో ఉన్న తెలుగు మీడియం రెస్టారెంట్ నుంచి మటన్ ఖీమా కర్రీ ఆర్డర్ చేశారు. కానీ డెలివరీ వచ్చిన వెంటనే.. వాసనపై అనుమానం కలిగించింది. కాస్త పరిశీలించగా అది పాడైపోయిన కర్రీ అని స్పష్టమైంది.

ఇది సాధారణ కస్టమర్ అయితే ఎక్కడో వదిలేసేవారేమో.. కానీ ఈసారి విషయం పోలీస్ ఆఫీసర్ వరకు చేరడంతో కథ మలుపు తిప్పింది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత సీన్ మరింత సీరియస్ అయ్యింది. అధికారులు రెస్టారెంట్‌పై దాడి చేసి, ఫుడ్ శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పరీక్షల కోసం పంపించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Spoiled Mutton Keema

Spoiled Mutton Keema

ఇక్కడితో కథ ముగియలేదు.. ఇదే సమయంలో నగరంలో ఫుడ్ సేఫ్టీపై భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి. ఒక రోజు ముందే కంపల్లీలో ఉన్న బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్‌పై కూడా దాడులు జరిగాయి. అక్కడ ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. 22 వాహనాలతో సరుకులు తరలిస్తున్నా.. వాటికి అవసరమైన అనుమతులు లేవని అధికారులు గుర్తించారు.

గత నెల రోజులుగా హైదరాబాద్‌లో బయటపడుతున్న ఘటనలు చూస్తే.. మన రోజూ తినేది నిజంగా సేఫేనా అనే సందేహం కలగడం సహజం. పోలీసుల స్పెషల్ టీమ్స్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 129.34 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకుని, 117 కేసులు నమోదు చేశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *