పదేళ్లకే నటనలో అదరగొట్టేస్తున్నాడు.. ఈ బుడతడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొడుకు.. ఎవరో గుర్తు పట్టారా?

పదేళ్లకే నటనలో అదరగొట్టేస్తున్నాడు.. ఈ బుడతడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొడుకు.. ఎవరో గుర్తు పట్టారా?


ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్ల కుమారులు, కుమార్తెలు చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఛైల్డ్ ఆర్టిస్టులుగా తమ ట్యాలెంట్ ను చాటుకుంటున్నారు. తాజాగా మరో స్టార్ కిడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ తో కేవలం 10 ఏళ్ల వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాజా శివాజీ. రితేశ్ దేశ్ ముఖ్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అతనితో పాటు జెనీలియా, విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, మహేష్ మంజ్రేకర్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, అమోల్ గుప్తే, బొమన్ ఇరానీ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చారిత్రక చిత్రానికి రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. అలాగే అతని భార్య జెనీలియా దేశ్‌ముఖ్ తన సొంత నిర్మాణ సంస్థ ముంబై ఫిల్మ్ కంపెనీ, జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 01న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా అందులోని ఓ చిన్న సీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆ సీన్‌లో చిన్ననాటి శివాజీగా కనిపించింది మరెవరో కాదు జెనీలియా- రితేశ్ దేశ్‌ముఖ్ ల ముద్దుల కుమారుడు రాహిల్ దేశ్‌ముఖ్. ఈ సినిమాతోనే రాహిల్ సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టనున్నాడు.

రితేశ్, జెనీలియాలది ప్రేమ వివాహం. 2012లో వీరి ప్రేమ వివాహం జరిగింది. 2014లో పెద్ద కుమారుడు రియాన్ జన్మించగా, 2016లో రాహిల్ కు జన్మనిచ్చింది జెనీలియా. ఈ స్టార్ కపుల్ తమ పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటారు. అయితే రాజా శివాజీ సినిమాలో రాహిల్ నటిస్తున్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదీ లవ్లీ కపుల్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

కుమారులతో జెనీలియా..

రాజా శివాజీ ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *