ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ మామూలుగా ఉండదు.. ప్రపంచ అగ్ర నేతల్లో ఒకరైన ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఆయన చాలా ఆసక్తికర విషయాలను మైక్రోబ్లాగింగ్ సైట్లలో పంచుకుంటారు. నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్.. ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్ లో ఏదైనా పోస్ట్ చేస్తే కోట్ల సంఖ్యలో వ్యూస్, లక్షల్లో లైకులు వస్తుంటాయి.. తాజాగా.. ప్రధాని మోదీ షేర్ చేసిన ఓ వీడియో.. జస్ట్ 24 గంటల్లో ఏకంగా లక్ష మిలియన్ వ్యూస్ దాటింది. అంటే.. అక్షరాల 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక్కరోజులో ఇన్‌స్టాగ్రామ్ లో.. 10 కోట్ల వ్యూస్, 6.3 మిలియన్ల లైకులు, 1 మిలియన్ షేర్లు ఇలా.. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ దూసుకెళ్తోంది. ఫేస్‌బుక్, ఎక్స్ లో కూడా విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. ఇంతకీ అది ఏ వీడియో ఏంటంటే.. ప్రధాని మోదీ స్వయంగా.. రుచికరమైన ఝల్‌మురి (ముర్మురాలు) ని కొనుగోలు చేసి తిన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా.. ఆయన బెంగాలీ స్ట్రీట్ ఫుడ్‌ను ఝల్‌మురి తింటూ ఆస్వాదించారు.. మోదీ చేసిన స్ట్రీట్‌ఫుడ్ షాపింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
ఆదివారం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా నాలుగు ర్యాలీలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఝార్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్‌మురిని తింటూ ప్రధాని మోదీ ఆస్వాదించారు. ఝల్‌మురి అనేది బెంగాల్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన స్పైసీ స్నాక్. ముర్మురాలు, మసాలా, ఉప్పు కారం, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి దీన్ని తయారు చేస్తారు. స్థానికులతో కలిసి ఝల్‌మురిని ఆస్వాదించారు మోదీ.ఝూర్‌గ్రామ్‌లో భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించిన తర్వాత హెలిప్యాడ్‌కు వెళ్లే దారిలో ఆగి ఈ బెంగాలీ స్ట్రీట్ ఫుడ్‌ను కొనుగోలు చేసి.. తిన్నారు. అంతేకాకుండా.. అక్కడున్నవారికి కూడా పంచారు.
ప్రధాని మోదీ వీడియో చూడండి..
దుకాణదారుడు ‘మీరు ఉల్లిపాయలు తింటారా?’ అని అడగ్గా.. ‘హా తింటాను, బుర్ర మాత్రం తినను’ అంటూ మోదీ నవ్వులు పూయించారు. అనంతరం అక్కడే ఉన్న మహిళలు, పిల్లలు, పార్టీ కార్యకర్తలతో ఆయన సరదాగా సంభాషించారు. ‘ఝార్గ్రామ్‌లో ఝాల్‌మురీ బ్రేక్’ అంటూ సంబంధిత ఫొటోలు, వీడియోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..