తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పళనిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్.. ఎన్నికలను మూడు విధాలుగా వర్గీకరిస్తూ.. ఇంట్రెంస్టింగ్ కామెంట్స్ చేశారు. మొదటి మోడల్ ద్రావిడ్ మోడల్ అని.. అది విద్యను అందించే, భాషను రక్షించే, గౌరవాన్ని కాపాడే మోడల్ అని ఆయన కొనియాడారు. రెండో మోడల్ అడిమై అంటే బానిస మోడల్ అని.. ఇది తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే మోడల్ అని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తే తమిళనాడుకు తీరని అన్యాయం జరుగుతుందని, దానికి ఈ బానిస మోడల్ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. ఇక మూడో మోడల్ సినిమా మోడల్ అని.. విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ఒకే పాటలో డాక్టర్, ఇంజినీర్ చివరికి ముఖ్యమంత్రి అయిపోవచ్చని, అయితే రియాల్టీ వేరంటూ.. ఎద్దేవా చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. భాషకు.., లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు, విజయ్ ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా అంటూ సూటి ప్రశ్న విసిరారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు నటుడి కోసం థియేటర్లో ఈలలు వేయడం వేరని.. దేశ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టడం వేరని.. వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Babu: రామ నామాన్ని ఎగతాళి చేస్తే నాశనమైపోతావ్
‘ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..’ ఆహాలో మంచి సిరీస్
ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు