హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2026 దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 20) ముగియనుంది. పాలిసెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 ముగింపు గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించాలి. ఇక రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏపీ పాలీసెట్ 2026 పరీక్ష మే 13, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.
తెలంగాణ పాలీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ పాలీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.