నడకతో కలిగే ప్రయోజనాలలో ఒకవేళ మీరు ఇప్పుడే వ్యాయామం ప్రారంభించినట్లయితే లేదా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటే వాకింగ్ ఉత్తమ ఎంపిక. ఎందుకు అంటే ఇది లో-ఇంపాక్ట్ వ్యాయామం. కాబట్టి మోకాళ్లు, కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది.
క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నడక వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది మంచి మార్గం.కేలరీలను నెమ్మదిగా ఖర్చు చేసినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది సుస్థిరమైన ఫ్యాట్ లాస్కు సహాయపడుతుంది.
పరుగుతో కలిగే ప్రయోజనాలలో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు ఆశించేవారికి రన్నింగ్ సరైన ఛాయిస్.నడకతో పోలిస్తే పరుగు తీయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.మీ బాడీ స్టామినాను, ఎండ్యూరెన్స్ను రన్నింగ్ వేగంగా పెంచుతుంది. మీరు బిజీగా ఉండి తక్కువ సమయం మాత్రమే వ్యాయామానికి కేటాయించగలిగితే, 15-20 నిమిషాల పరుగు మంచి రిజల్ట్ ఇస్తుంది. రన్నింగ్ మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, గుండె పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది.
అసలు విషయం ఏంటంటే.. నడక లేదా పరుగు – ఏది చేసినా మీ ఆరోగ్యానికి మేలే.ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది మీ శరీరం సహకరించే తీరును బట్టి, మీకున్న సమయాన్ని బట్టి ఉంటుంది. ఏ వ్యాయామం చేస్తున్నామన్నది కాదు.. ఎంత క్రమం తప్పకుండా చేస్తున్నామన్నదే ముఖ్యం.
మీరు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడిచినా లేదా 15 నిమిషాల పాటు పరుగెత్తినా.. ఫలితం మాత్రం మెరుగైన ఆరోగ్యమే. కాబట్టి, సోమరితనాన్ని వదిలి ఇప్పుడే మీ షూస్ ధరించండి.. కదలండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.




