టాలీవుడ్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, బాల్య విశేషాలు, విద్య, స్ఫూర్తిదాయక విషయాలను పంచుకున్నారు. బాలనటిగా 50 చిత్రాలలో నటించిన మీనా, 1982లో నెంజంగళ్ చిత్రంతో శివాజీ గణేశన్‌తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, బాలకృష్ణ వంటి దిగ్గజ నటులతో బాలనటిగా, ఆపై హీరోయిన్‌గా నటించిన అరుదైన గౌరవం మీనాకు దక్కింది. బాలకృష్ణతో కలిసి డిస్కో డాన్సర్ చిత్రంలో బాలనటిగా నటించిన విషయం చాలా మందికి తెలియదని ఆమె తెలిపారు. శ్రీదేవి, జయలలిత వంటి కొద్దిమంది నటీమణులకు మాత్రమే దక్కిన ఈ అరుదైన ప్రస్థానం తన కెరీర్‌లో ఒక విశిష్టమైన మైలురాయి అని మీనా పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..
నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి చిత్రంలో నటించే అవకాశాన్ని తాను కోల్పోయానని మీనా వివరించారు. ఆ చిత్రంలో మూడు అక్కచెల్లెళ్లలో ఒకరిగా నటించాల్సి ఉండగా, పరీక్షల కారణంగా ఊటీలో 20 రోజుల షూటింగ్‌కు హాజరు కాలేకపోయానని చెప్పారు. తన తల్లి చదువు పూర్తి చేయలేదని బాధపడటంతో, ఆమె ప్రోత్సాహంతో ప్రైవేట్‌గా ఎంఏ చరిత్రను పూర్తి చేసినట్లు మీనా వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
తాను ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, అయితే ఎంఏ పూర్తి చేసినందున అక్కినేని నాగేశ్వరరావు కంటే ఎక్కువ చదివినట్లయిందని హాస్యంగా పేర్కొన్నారు. నాగేశ్వరరావు ఐదో తరగతి వరకు చదివి, తనను తాను “ఫిఫ్త్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్” అని పిలుచుకునేవారని మీనా గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

Balakrishna, Meena
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?