కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు మిల్లెట్స్ అంటే సజ్జలు లేదా రాగి, రెండు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె
అర టేబుల్ ఆవాలు, అర టేబుల్ స్పూన్న్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు, రెండు ఎండు మిర్చి, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ను తీసుకోవాలి.
ముందుగా పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, సెనగపప్పును బాగా వేయించాలి.
ఆ తరవాత దీనిలో రెండు పచ్చిమిర్చి, మూడు ఎండు మిర్చి, అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి వాటిని బాగా మరిగించాలి.
ఇంకా ఆ తరువాత ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. మిల్లెట్స్ పోస్తూ వాటిని గట్టిగా అవ్వకుండా బాగా కలుపుతూ ఉండాలి.
ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నీరు లేదా నెయ్యి వేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఈ పిడికిళ్లను తీసుకుని ఇడ్లీ ప్లేట్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆవిరి మీద బాగా ఉడికించాలి. వీటిని కొబ్బరి పచ్చడి , లేదా పల్లీల పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.




