Anna Rajan: సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ కాదు.. నాదగ్గర కథలొద్దు

Anna Rajan: సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ కాదు.. నాదగ్గర కథలొద్దు


ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్‌స్క్రిప్షన్‌ అనగానే అక్కడేదో బూతు కంటెంట్‌ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టి.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. తన అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్‌ను రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశానని చెప్పిన రేష్మ రాజన్.. సబ్‌ స్క్రిప్షన్‌తోనే తన ఫాలోవర్స్‌ను కనెక్ట్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు సబ్‌స్క్రిప్షన్‌ వల్ల తన రీల్స్‌, ఫోటోలు ముందుగానే తన ఫాలోవర్స్‌కు పంచుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తనతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకునే తన ఫాలోవర్స్‌కు సబ్‌స్క్రిప్షనే బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు రేష్మ. అయితే సబ్‌స్క్రిప్షన్‌ అంటే అక్కడేదో బూతు కంటెంట్‌ ఉంటుందని కాదని.. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయంటూ చెప్పుకొచ్చారు రేష్మ. అంతేకాదు ఏదేదో.. ఊహించుకుని మాత్రం తన అకౌంట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోకండి అంటూ చెబుతున్నారు. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని.. ఈ విషయం క్లియర్‌గా చెప్తున్నా అంటూ తన ఇన్‌స్టాపోస్టులో రాసుకొచ్చారు రేష్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూనే.. ఓ వర్గం నుంచి విమర్శలు వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక రైళ్లలో ‘డగ డగ’ శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !

చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??

ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా ??

Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్

Renu Desai: బద్రి సినిమా ముచ్చట్లు చెప్పిన రేణు దేశాయ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *