LED Credit Cards: పేమెంట్ చేయగానే వెలిగే క్రెడిట్ కార్డ్.. భారత్‌లో తొలిసారిగా ‘LED క్రెడిట్ కార్డ్’.. దీని ప్రత్యేకతలు ఇవే!

LED Credit Cards: పేమెంట్ చేయగానే వెలిగే క్రెడిట్ కార్డ్.. భారత్‌లో తొలిసారిగా ‘LED క్రెడిట్ కార్డ్’.. దీని ప్రత్యేకతలు ఇవే!


LED Credit Cards: క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్ CheQ, ప్రముఖ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో జతకట్టి దేశంలోనే మొట్టమొదటి ఎల్‌ఈడీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ కార్డులో ఉన్న ప్రధాన ఆకర్షణ “టాప్-టు-పే LED ఫీచర్”.

ఈ LED ఎలా పనిచేస్తుంది?

ఈ కార్డులో ఒక ప్రత్యేకమైన ఎల్‌ఈడీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. మీరు మర్చంట్ స్టోర్‌లోని POS మెషీన్ దగ్గర కార్డును ‘టాప్’ (Contactless Payment) చేసినప్పుడు అందులోని లైట్ వెలుగుతుంది.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ అవసరం లేదు:

ఈ లైట్ వెలగడానికి విడిగా ఎలాంటి బ్యాటరీ అవసరం లేదు. పేమెంట్ మెషీన్ నుంచి వచ్చే NFC (Near Field Communication) సిగ్నల్స్ ద్వారానే ఇది శక్తిని గ్రహించి వెలుగుతుంది. దీనివల్ల పేమెంట్ చేయడం మరింత ఆకర్షణీయంగా, సురక్షితంగా మారుతుంది.

UPI సపోర్ట్ కూడా ఉంది:

ఇది RuPay ప్లాట్‌ఫారమ్‌పై వస్తుంది. అందుకే మీరు ఈ క్రెడిట్ కార్డును నేరుగా మీ UPI (Google Pay, PhonePe మొదలైనవి)కి లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న దుకాణాల్లో కూడా క్రెడిట్ కార్డుతోనే స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. రివార్డ్ పాయింట్లు పొందవచ్చు.

ఫీజు, ఇతర వివరాలు:

వార్షిక రుసుము: రూ.499 (ఏడాదికి రూ.3 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఫీజు రద్దు అవుతుంది).

LED వెర్షన్ ఛార్జ్: ఈ ప్రత్యేకమైన ఎల్‌ఈడీ కార్డు కోసం అదనంగా రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, CheQ కస్టమర్ల కోసం మే 31, 2026 వరకు ఈ రుసుమును రద్దు చేశారు. వెల్కమ్ బెనిఫిట్: కార్డు తీసుకున్న వారికి రూ.695 విలువైన EazyDiner మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది.

రివార్డ్ సిస్టమ్ ఎందుకు ప్రత్యేకం?

చాలా కార్డుల్లో రివార్డ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో, ఎలా వాడుకోవాలో అర్థం కాదు. కానీ ఈ కార్డులో వచ్చే రివార్డులన్నీ “CheQ Points” రూపంలో వస్తాయి. వీటిని CheQ యాప్‌ ద్వారా చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు. రీడీమ్ చేసుకోవచ్చు.

ఎప్పుడు.. ఎలా అప్లై చేయాలి?

మీరు ఈ మెరిసే ఎల్‌ఈడీ క్రెడిట్ కార్డును పొందాలనుకుంటే ఏప్రిల్ 28, 2026 నుండి CheQ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 1.5 కోట్ల క్రెడిట్ కార్డుల డేటా, యూజర్ల అవసరాలను విశ్లేషించి ఈ కార్డును రూపొందించారు. కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, యూపీఐ సపోర్ట్, సులభమైన రివార్డ్ విధానంతో ఇది యువతను విశేషంగా ఆకట్టుకోనుంది.

ఇది కూడా చదవండి: Zero Tax: రూ. 20 లక్షల జీతం ఉన్నా ‘జీరో టాక్స్’.. కొత్త పన్ను విధానంలో ఈ ట్రిక్స్ మీకు తెలుసా?

ఇది కూడా చదవండి: Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *