కంటెంట్ క్రియేటర్‌గా రాణిస్తున్న సురభి పిసల్ తన వెయిట్‌లాస్ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రసవానంతరం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. కేవలం జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారానే తన పాత రూపాన్ని మళ్ళీ పొందగలిగానని ఆమె గర్వంగా చెబుతోంది. బరువు తగ్గడం అంటే శరీరాన్ని హింసించుకోవడం కాదు, దానిని సరైన పద్ధతిలో ప్రేమించడం అని సురభి మాటలు స్పష్టం చేస్తున్నాయి. స్థిరమైన మార్పులు, సరైన ఆహార నియమాలు ఉంటే ఎవరైనా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
మెరుగైన జీవక్రియ
ప్రసవానంతరం పెరిగిన బరువు వల్ల సురభి మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ డైట్ పాటించినా కడుపు ఉబ్బరం ఇంకా నీరసం వంటి సమస్యలు వేధించేవి. అటువంటి సమయంలో ఆమె ‘ఆపిల్ సైడర్ వెనిగర్’ తీసుకోవడం ప్రారంభించారు. ఇది ఆమె శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి, అకాల ఆకలిని నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడింది. దీనివల్ల ఆమె ఆహారంపై నియంత్రణ సాధించగలిగారు. క్రమంగా బరువులో మార్పులు రావడం, పాత బట్టలు మళ్ళీ సరిపోవడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కేవలం బరువు తగ్గడం మీద మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని ఆమె వివరించారు.
నల్ల జీలకర్ర నూనె ..
సురభి తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ‘నల్ల జీలకర్ర నూనె’ను తీసుకునేవారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడమే కాకుండా శరీరానికి మంచి ఎనర్జీని ఇచ్చేది. ఆ తర్వాత ఆమె ‘బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ’ని అలవాటు చేసుకున్నారు. అంటే బ్లాక్ కాఫీలో కొంచెం కొబ్బరి నూనె కలిపి తీసుకోవడం. కొబ్బరి నూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సాయపడతాయి. ఇది తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. ఇవన్నీ సహజ సిద్ధమైన మార్గాలు కావడంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఆమె బరువు తగ్గగలిగారు.
ఆమె తన ఆహారంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. అదే ‘ఎల్డర్‌బెర్రీ పొడి’. దీనిని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు లభించి రోగనిరోధక శక్తి పెరిగింది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని కూడా కాంతివంతంగా మార్చింది. తాను ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వల్ల బరువు తగ్గడం అనేది ఒక సహజమైన ప్రక్రియలా దానంతట అదే జరిగిపోయిందని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వ్యాయామం చేయడానికి సమయం లేని గృహిణులు లేదా తల్లులకు ఇటువంటి సహజమైన పద్ధతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సురభి పిసల్ వెయిట్‌లాస్ జర్నీ మనకు నేర్పే పాఠం ఒక్కటే.. మన ఆరోగ్యం మన జీవనశైలిలోనే దాగి ఉంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు కూడా ఆరోగ్యకరమైన మార్పును ఆహ్వానించండి. అయితే ఇటువంటి పద్ధతులను పాటించే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.