రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం


కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.. ఇప్పటికే.. విపక్షాల తీరును కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ తప్పు పట్టారు.

మహిళల హక్కులకు కాంగ్రెస్‌ వ్యతిరేకమన్నారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు. రాజకీయ దురుద్దేశంలో ఈ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *