Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..


లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) తిరస్కరించిన ఒక పాట, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత విజయవంతమైన పాటలలో ఒకటిగా ఎలా మారిందో రచయిత కనగాల జయకుమార్ తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో జయకుమార్ ఈ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. “ఈ కథ గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ సమయంలో మొదలవుతుంది. ఈ సినిమా కోసం “ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా తడిపడి ఊహల పొడి దెబ్బ తొలకరి వలపుకు గురుతబ్బా” అనే పాట రికార్డు చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ మేకప్ వేసుకొని షూటింగ్ కోసం సిద్ధమవుతుండగా, దర్శకుడు కోదండరామిరెడ్డిని పాట ప్లే చేయమని అడిగారు. పాట వింటూనే ఏఎన్ఆర్ ముఖం సీరియస్ అయ్యింది. పాటలోని “ఇదేమిటబ్బా… తడిపడి ఊహల పొడి దెబ్బ… తొలకరి వలపుకు గురుతబ్బా” అనే సాహిత్యానికి ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “నాకు లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారయ్యా. నా సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తారు. ఈ పాట నా మీద షూట్ చేస్తే వాళ్లంతా ఏమనుకుంటారు?” అని కోదండరామిరెడ్డిని గట్టిగా ప్రశ్నించారు. ఈ పాట తన ఇమేజ్‌కు, ప్రేక్షకుల అంచనాలకు సరిపోదని ఏఎన్ఆర్ స్పష్టం చేశారు ” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..

ఏఎన్ఆర్ ఆదేశం మేరకు, ఆ రోజు షూటింగ్ రద్దయింది. కోదండరామిరెడ్డి ఆ పాటను గోపాలకృష్ణుడు సినిమా నుంచి తీసివేయక తప్పలేదు. దాని స్థానంలో, “గోదారి గట్టంట వయ్యారి పెట్టంట రివ్వుమంటే జివ్వుమంది నాకు మొక్కువా” అనే మరో పాటను రికార్డు చేసి ఏఎన్ఆర్ మీద కేరళలో చిత్రీకరించారు. ఈ సినిమాకు భీమవరుపు బుచ్చిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా, కనగాల జయకుమార్ కో-డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే, కోదండరామిరెడ్డి వద్ద ఉన్న రికార్డు చేయబడిన “ఇదేమిటబ్బా” పాటను వృథా చేయదలచుకోలేదు. ఆయన చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం కోసం ఆ పాటను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

ఖైదీ చిత్రంలో చిరంజీవిపై ఈ పాట అద్భుతంగా చిత్రీకరింతారు. పాటలోని ట్యూన్‌కు, సాహిత్యానికి చిరంజీవి నటన సంపూర్ణంగా సరిపోవడంతో, ఇది ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ఒకటిగా నిలిచిపోయిందిఇది కేవలం పాటల విషయంలోనే కాదు, కొన్ని సినిమాలు కూడా కొందరు హీరోలు తిరస్కరించిన తర్వాత, అవి వేరే హీరోలతో భారీ విజయాలు సాధించిన సందర్భాలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..



ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *