వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల విదేశాల్లో చదువులు, విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ రాశివారు బాగా పట్టుదలగా, అవిశ్రాంతంగా శ్రమించి తమ ఆశల్ని, ఆశయాన్ని తప్పకుండా సాధించుకుంటారు. రావలసిన డబ్బును రాబట్టుకోవడం, ఆస్తి వివాదాన్ని ఏదో విధంగా పరిష్కరించుకోవడం, వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం వంటివి జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.