ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??

ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??


పంజాగుట్ట ఎర్రమంజిల్ గెలేరియా మాల్లో హృదయ విదారక ఘటన చోటు చేసకుంది. మాల్లోని PVR మల్టీప్లెక్స్‌ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ ఉద్యోగి ప్రాణం పోయింది. దీంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులు మాల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సత్యనారాయణ మరణానికి pvr నిర్లక్ష్య వైఖరే కారణమని ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న దాని ప్రకారం.. PVR మల్టీప్లెక్స్‌లో.. సత్యనారాయణ గత కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సత్యనారాయణకు డ్యూటీలోనే చాతి నొప్పి రావడంతో.. ఇంటికి వెళతానంటూ థియేటర్‌ యాజమాన్యానికి చెప్పాడట. అయితే ఇది నమ్మని యాజమాన్యం.. అతడిని వెళ్లొద్దని ఆదేశించిందట. దీంతో చాతి నొప్పితోనే యధావిధిగా డ్యూటీ చేస్తున్న సత్యనారాయణ ఉన్నట్టుండి.. సినిమా ప్రొజెక్టర్ రూమ్‌లో కుప్పకూలి, ఊపిరి విడిచాడని.. సత్యనారాయణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆ మరణం తమ మెడకు చుట్టుకోకుండా… డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా ఫుట్ పాత్ పై పడేశారని బందువులు ఆరోపిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్లో.. థియేటర్‌ యాజమాన్యం పై ఫిర్యాదు చేయడమే కాకుండా… మాల్ ముందు ధర్నాకు దిగారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు.. సత్యనారాయణ కుంటుంబ సభ్యులకు సర్తి చెప్పే ప్రయత్నం చేశారు.పోస్టు మార్టం కోసం… డెబ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *