Prakash Raj : రాముడు, రావణుడిపై కామెంట్స్.. చిక్కుల్లో నటుడు ప్రకాష్ రాజ్.. కేసు నమోదు..

Prakash Raj : రాముడు, రావణుడిపై కామెంట్స్.. చిక్కుల్లో నటుడు ప్రకాష్ రాజ్.. కేసు నమోదు..


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన రామాయణం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆయన పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ నటుడిపై ఒక ఫిర్యాదు దాఖలైంది. జనవరిలో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు ఉత్త భారతదేశానికి చెందినవారని.. రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవారని అన్నారు. అంతేకాదు..శ్రీరాముడు రావణుడి తోటలోని పండ్లను తిని, వాటికి డబ్బులు చెల్లించలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడిగా పూజించే రాముడిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..

ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కొందరు సామాజిక కార్యకర్తలు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను అవమానించడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించడం వంటి సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గతంలోనూ సనాతన ధర్మం, ఇతర మతపరమైన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

నిరంతరం తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే ప్రకాష్ రాజ్, ఈ తాజా వివాదంపై ఇంకా అధికారికంగా పూర్తిస్థాయిలో స్పందించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో, విచారణలో ఏం తేలనుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *