Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూరు.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. డైరెక్టర్ ఎవరంటే..

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూరు.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. డైరెక్టర్ ఎవరంటే..


ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

ఈ రోజు రిలీజ్ చేసిన వీడీ శౌర్యువ్ మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలు చేపట్టి రావడం ఆసక్తి కలిగిస్తోంది. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *