టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన సంజూ శాంసన్.. ఎవరామే, అసలు మ్యాటర్ ఏంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన సంజూ శాంసన్.. ఎవరామే, అసలు మ్యాటర్ ఏంటంటే?


Sanju Samson: భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజు శాంసన్, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా మలయాళీ ముద్దుగుమ్మగా ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ హీరోయిన్.. తెలుగు, తమిళం, హిందీలోనూ పేరు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా తన సత్తా చాటుతూ దూసుకపోతోంది. అయితే, తాజాగా వెల్లడైన సమాచారం మేరకు టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్, ఈ స్టార్ హీరోయిన్ ను వెనక్కునెట్టేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆ వివరాలు ఓసారి చూద్దాం..

తాజా గణాంకాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో సంజు శాంసన్ అనుచరుల సంఖ్య 19.1 మిలియన్లకు చేరుకుంది. దీనితో ఇప్పటివరకు 18.8 మిలియన్ల అనుచరులతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ నటి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సంజు ఫాలోయింగ్ ఊహించని రీతిలో పెరగడం విశేషం.

ప్రపంచకప్ విజయం.. మారిన జాతకం..

సంజు శాంసన్ సాధించిన ఈ అరుదైన ఘనతకు ప్రధాన కారణం 2026 టీ20 ప్రపంచకప్. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆరంభంలో అవకాశాల కోసం నిరీక్షించినా, సూపర్ 8 దశ నుంచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌పై 97 పరుగులు, సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు, ఫైనల్ మ్యాచ్‌లో మరో 89 పరుగులతో జట్టును గెలిపించి దేశవ్యాప్త అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శన అతడిని జాతీయ హీరోగా మార్చడంతో పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్ల వరదను తెచ్చిపెట్టింది.

ఇంతకీ ఆ హీరోయిన ఎవరో తెలుసా..?

సంజూ శాంసన్ తో పోటీ పడిన ఈ స్టార్ హీరోయిన ఎవరో కాదండోయ్.. ‘మహానటి’ ఫేం కీర్తి సురేష్. దక్షిణాది సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్, ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఉన్న ఆదరణ అపారం. అయితే, క్రికెట్ ప్రపంచంలో సంజు సాధించిన ప్రపంచకప్ ఘనత కేవలం కేరళకే పరిమితం కాకుండా యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. అందుకే ఆమె రికార్డును అధిగమించి సంజు మొదటి స్థానానికి చేరుకోగలిగాడు. భవిష్యత్తులో ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఈ ‘డిజిటల్ పోరు’ మరిన్ని ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశం ఉంది.

వెనుకబడ్డ ఇతర మలయాళీ స్టార్లు..

కేరళ నుంచి వెండితెరపై, క్రీడా మైదానంలో రాణిస్తున్న సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే, మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టాప్ 5లో ఉన్న ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 15.9 మిలియన్ల అనుచరులతో నాలుగో స్థానానికి పడిపోయాడు. మరోవైపు, ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ 16.6 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. సినిమాల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, క్రికెట్ పట్ల భారతీయులకున్న అభిమానం సంజును అందరికంటే ముందు నిలబెట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *