Viral Video: కదులుతున్న రైల్లో అర్థరాత్రి అలజడి..! టీటీఈ పరుగులు..కట్‌ చేస్తే భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు

Viral Video: కదులుతున్న రైల్లో అర్థరాత్రి అలజడి..! టీటీఈ పరుగులు..కట్‌ చేస్తే భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు


భారతీయ రైల్వే కేవలం ప్రయాణ సాధనమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు ప్రాణదాతగా కూడా నిలుస్తుందని మరోసారి నిరూపితమైంది. కదులుతున్న రైలులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక శిశువుకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి కాపాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక కుటుంబం పసిబిడ్డతో కలిసి రైల్లో ప్రయాణిస్తున్నారు. రైలు వేగంగా వెళ్తుందగా, అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారికి ఒక్కసారి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేని ఆ సమయంలో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వారి ఆవేదనను గమనించిన ఆ కోచ్ టీటీఈ వెంటనే రంగంలోకి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

డాక్టర్ భవన అనే మహిళ మార్చి 13న తన చిన్నారితో కలిసి బెంగళూరు నుండి గుజరాత్ వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణంలో చిన్నారికి మునగకాయ సూప్ తాగించగా, అది పడక పాప నిరంతరాయంగా వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. కదులుతున్న రైలులో చిన్నారి నీరసించిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆ తల్లి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భవన వెంటనే రైలులోని టీటీఈని సంప్రదించి, రైలులో మందులు ఎలా పొందాలో అడిగారు. సాధారణంగా ఏదైనా సమాచారం ఇస్తారని ఆమె భావించారు. కానీ రైల్వే యంత్రాంగం అంతకంటే వేగంగా స్పందించింది. టీటీఈ సమాచారం అందిన వెంటనే, రైల్వే అధికారులు తదుపరి ప్రధాన స్టేషన్ అయిన హిందూపూర్ అధికారులను అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రైలు హిందూపూర్ స్టేషన్‌లో ఆగగానే, అప్పటికే అక్కడ ఒక డాక్టర్, మందులు సిద్ధంగా ఉన్నాయి. రైలు ఆగీ ఆగగానే డాక్టర్ లోపలికి వచ్చి చిన్నారిని పరీక్షించి, అవసరమైన చికిత్స, మందులను అందించారు. కేవలం వైద్యం అందించడమే కాకుండా, మందులకు సంబంధించిన సరైన బిల్లును కూడా ఇచ్చారు. ఈ మొత్తం అనుభవాన్ని వివరిస్తూ భవన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ భావన తన భావోద్వేగ అనుభవాన్ని పంచుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా, నెటిజన్లు రైల్వే సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియోలో ఆ చిన్నారి తల్లి కళ్లల్లో నీళ్లతో టీటీఈకి, డాక్టర్‌కు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలపడం అందరినీ కదిలిస్తోంది. రైల్వే శాఖ సమర్థతను, ప్రయాణికులలో ఉండే మానవత్వాన్ని ఈ సంఘటన చాటిచెప్పింది. నెటిజన్లు ఆ టీటీఈ, డాక్టర్‌ను రియల్ హీరోలుగా కొనియాడుతున్నారు. రైలు ప్రయాణాల్లో ఇలాంటి ఆకస్మిక ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే రైల్వే యాప్ (RailMadad) ద్వారా లేదా 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *