ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!

ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!


పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరగనున్నాయా..? ఎన్నికల తర్వాత మళ్లీ పెరుగుతాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి. కంపెనీలకు కోట్లలో నష్టం వస్తుంది. దీంతో ఎన్నికల తర్వాత పెరగవచ్చు. భారత్ ముడి చమురులో 88 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగినా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. అప్పట్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావంతో బ్యారెల్ చమురు 120 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ మన వద్ద ధరలు పెరగకపోవడంతో చమురురంగ కంపెనీలు నష్టాలను చూస్తున్నాయి. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు రోజుకు 2,400 కోట్ల రూపాయలు నష్టాలను భరించాల్సి వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యంతో చమురు సంస్థలకు కొంత ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దీంతో చమురు రంగ కంపెనీల నష్టం రూ.1,600 కోట్లకు తగ్గింది. ఎక్సైంజ్ సుంకం తగ్గించినా వాటి ప్రయోజనాలను కస్టమర్లకు కంపెనీలు బదిలీ చేయలేదు. తమ నష్టాలను పాక్షికంగా తగ్గించుకోవడానికి ఉపయోగించాయి. మార్చిలో కంపెనీలు భారీగా నష్టపోయాయి. జ నవరి, ఫిబ్రవరి నెలల్లో చమురు కంపెనీలకు లాభాలు వచ్చినప్పటికీ, ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా అవి తుడిచిపెట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర 135-165 డాలర్ల మధ్య ఉంటే మనదేశంలోని ప్రస్తుత ధరలను బట్టి లీటర్ పెట్రోలుపై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు వస్తాయని మాక్వరీ గ్రూప్ అంచనా వేసింది. క్రూడాయిల్ ధర 10 డాలర్లు పెరిగితే చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.6 చొప్పున నష్టపోతాయని తెలిపింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *