తెలంగాణలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా దంచికొడుతున్నాయి. గాలిలో తేమ తగ్గి, సెగలు కక్కుతున్న వడగాలులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగి, గరిష్ఠంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, గొడుగు తప్పనిసరిగా వాడాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా
ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు
Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్