దేశంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల వాటి నమూనా ఆలయాలను మనం మన ఊర్లలో చూస్తూ ఉంటాం సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను దర్శించలేని వారు ఈ నమూనా ఆలయాలను దర్శిస్తూ తమ ఇష్ట దైవం ను కొలుస్తూ ఉంటారు.
అయితే, ఎంతో చరిత్ర కలిగిన తమిళనాడు తిరువణ్ణామలైలోని ఆరుణాచల క్షేత్రం నమూనాను పోడూరు మండలం జిన్నూరు గ్రామం లో ఉన్న రమణ క్షేత్రం ప్రాంగ ణంలో తీర్చిదిద్దారు.
అరుణాచలంలో ఉన్నట్లే దీని చుట్టూ ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలు, రమణమహర్షి ఆశ్రమ నమూనాలు ఏర్పాటు చేశారు.
వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర శిలలతో దీనిని 2019లో నిర్మించినట్లు నిర్వాహకుడు భూపతిరాజు సూర్యనారాయణరాజు తెలిపారు.
ప్రతి పౌర్ణమికి ఇక్కడ తిరువణ్ణా మలైలో మాదిరిగా ప్రత్యేక పూజలు జరుగుతాయని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ నమూనా ఆలయం ను దర్శించి గిరి ప్రదక్షిణలు చేస్తారని తెలిపారు.




