Viral Video: సమ్మర్ వచ్చిందని కూల్‌డ్రింక్ తాగాలనుకుంది.. తీరా క్యాన్ ఓపెన్ చేసి చూడగా..

Viral Video: సమ్మర్ వచ్చిందని కూల్‌డ్రింక్ తాగాలనుకుంది.. తీరా క్యాన్ ఓపెన్ చేసి చూడగా..


ప్రముఖ అంతర్జాతీయ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక మహిళ కొనుగోలు చేసిన స్టార్‌బక్స్ క్యాన్డ్ డ్రింక్‌లో చచ్చిన ఎలుక కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..! సాధారణంగా నాణ్యతకు మారుపేరుగా భావించే అంతర్జాతీయ బ్రాండ్లలో ఇలాంటి ఘటనలు జరగడం అరుదు. కానీ, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక మహిళ స్టార్‌బక్స్ డ్రింక్ తాగేందుకు రెడీ అవుతుండగా, ఆ క్యాన్ లోపల ఏదో ఉన్నట్లు గమనించింది. తీరా దాన్ని బయటకు తీసి చూడగా, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక చిన్న ఎలుక కనిపించింది. దీంతో సదరు మహిళ తీవ్ర అసహనానికి లోనైనట్టు కెమెరాలో బంధించి ఆ దృశ్యాల్లో మీరు చూడవచ్చు.

ఈ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు వినియోగదారులు ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఇది ఒక పకడ్బందీ డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. అంత చిన్న క్యాన్ లోపలికి ఎలుక వెళ్లడం అసాధ్యమని, కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా క్యాన్ మూత తెరిచిన తీరు, ఎలుక ఉన్న విధానం చూస్తుంటే ఇది ఉద్దేశపూర్వక చర్యగా కనిపిస్తోందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా అనేక పెద్ద సంస్థల ఉత్పత్తులపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే స్టార్‌బక్స్ లాంటి సంస్థలు అత్యాధునిక యంత్రాల ద్వారా ప్యాకేజింగ్ చేస్తాయి కాబట్టి, ఎలుక లాంటివి లోపలికి వెళ్లడం దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియో సృష్టించిన వివాదంపై స్టార్‌బక్స్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఇది తప్పుడు ప్రచారం అని తేలితే సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడంతో పాటు, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

ఇది చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *