ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు ఉదయం 10.31 గంటలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఒకే సమయంలో అటు ఫస్ట్ ఇయర్, ఇటు సెకండ్ ఇయర్ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం నుంచి 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా వారిగా చూస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సుమారు 1,02,000 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://results-bie.ap.gov.in ను సందర్శించవచ్చు. అలాగే వాట్సప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లతో పాటు టీవీ9 వెబ్ సైట్ ద్వారా కూడా మీరు త్వరతగిన ఇంటర్ ఫలితాలను చూడవచ్చు.