కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు


కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ సీజన్‌ జోరుగా నడుస్తోంది. సూపర్ స్టార్‌లు, చిన్న స్టార్‌లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పాత కథలను సరికొత్తగా కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు. రాబోయే ఒకటి, రెండు సంవత్సరాలలో ప్రజలు ఈ తెలిసిన కథల కొనసాగింపులను ఫ్రెష్‌గా చూడటానికి సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ నటించిన “జైలర్” చిత్రం నుండి ముత్తువేల్ పాండ్యన్ పాత్ర కోసం అభిమానులు మరోసారి ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్‌లో యాక్షన్ డబుల్ అవుతుందని, కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్ నేపథ్యంలో సాగుతుందని టాక్. కార్తీ ఖాతాలోనూ సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది. “సర్దార్” హిట్ అవ్వడంతో “సర్దార్ 2″పై ఆశలు పెరిగాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఖైదీ 2″పైనా ప్రజలు ఎక్కువగా దృష్టి సారించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *