హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు


హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

ఇరాన్‌తో అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన చర్చలు ఫెయిలయ్యాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. అమెరికా పెట్టిన షరతులను టెహ్రాన్ తిరస్కరించడమే అందుకు కారణమని, అది అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని హెచ్చరించారు. మా షరతులను అంగీకరించడానికి ఇరాన్ ఇష్టపడలేదు అన్నారు. “ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని, వాటిని వేగంగా సమకూర్చుకోగల సాధనాల జోలికి వెళ్లబోమని కచ్చితమైన, దీర్ఘకాలిక హామీ ఇవ్వాలి. కేవలం ఇప్పటికో, రెండేళ్లకో కాదు.. సుదీర్ఘ కాలం పాటు ఈ నిబద్ధతను మేము చూడాలనుకుంటున్నాం. కానీ, అది ఇప్పటివరకు మాకు కనిపించలేదు” అని తెలిపారు. హ‌ర్మూజ్ జలసంధిలో తనే స్వయంగా ఏర్పాటు చేసిన సముద్రపు మైన్‌లను తొలగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది ఇరాన్‌. ఈ మైన్‌ల జాడ తెలియకపోవడంతో ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడం ఆలస్యమవుతోంది. అది ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనకు దారితీస్తోంది. చిన్న పడవల ద్వారా మైన్‌లను అమర్చారని, వాటికి సంబంధించిన సరైన రికార్డులు లేవని తెలుస్తోంది. కొన్ని మైన్‌లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయే విధంగా అమర్చడంతో వాటిని గుర్తించడం, తొలగించడం కష్టంగా మారింది. ఈ పరిణామం వాణిజ్య నౌకలకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. . సముద్రపు మైన్‌లతో ప్రమాదం ఉన్నందున, నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇరాన్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సూచించింది. అయితే, రుసుము చెల్లించే నౌకల కోసం మరో మార్గాన్ని తెరిచి ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రెండు అమెరికా యుద్ధనౌకలు హ‌ర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి. జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ హోర్ముజ్‌ జలమార్గాన్ని దాదాపుగా దిగ్బంధించింది. ప్రపంచంలోని ముడిచమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్

బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు

ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *