రీల్స్ పిచ్చి పరాకాష్ట! చిన్నారిని బాల్కనీ నుంచి దూకమన్న తండ్రి.. షాక్‌లో నెటిజన్లు

రీల్స్ పిచ్చి పరాకాష్ట! చిన్నారిని బాల్కనీ నుంచి దూకమన్న తండ్రి.. షాక్‌లో నెటిజన్లు


రీల్స్ పిచ్చి పరాకాష్ట! చిన్నారిని బాల్కనీ నుంచి దూకమన్న తండ్రి.. షాక్‌లో నెటిజన్లు

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, తాజాగా ఒక తండ్రి తన కన్నబిడ్డను అపాయంలోకి నెట్టిన తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక వ్యక్తి తన చిన్న కుమారుడిని ఇంటి బాల్కనీ వద్దకు తీసుకువచ్చి, అక్కడి నుండి కిందకు దూకమని చెప్పాడు. ఆ చిన్నారి భయంతో ఏడుస్తున్నా, వెనకడుగు వేస్తున్నా వినకుండా ఆ తండ్రి పదే పదే దూకమని ప్రోత్సహించాడు. క్షణాల్లోనే ఆ చిన్నారి కిందకు దూకేశాడు. అదృష్టవశాత్తు, తండ్రి అతడిని పట్టుకున్నాడు. కేవలం ఒక సాహసోపేతమైన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే దుర్బుద్ధితోనే అతడు ఈ పనికి ఒడిగట్టాడు. ఆ వీడియోలో చిన్నారి భయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ తండ్రి మాత్రం కెమెరా వైపు చూస్తూ వీడియో తీయడంలోనే నిమగ్నమయ్యాడు.

ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఒక రీల్ కోసం బిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం వికృతం అంటున్నారు. లైక్స్ కోసం సొంత బిడ్డ ప్రాణాలను ఫణంగా పెడతారా? అని కొందరు ప్రశ్నిస్తుండగా..ఇలాంటి వారిపై చైల్డ్ అబ్యూస్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి అని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉండాలో ఈ ఘటన నేర్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jobaaj Stories (@jobaajstories)

సాంకేతికతను వినోదం కోసం వాడటంలో తప్పులేదు, కానీ అది ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి చేరడం ఆందోళనకరం. ముఖ్యంగా పిల్లలకు రక్షణగా ఉండాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరం అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలను ప్రోత్సహించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *