పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌


పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఎండలు పెరుగుతున్న వేళ సరీసృపాలు వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటు ఆహారం, ఇటు చల్లదనాన్ని వెతుక్కుంటూ నివాస ప్రాంతాల్లోకి చొరబడుతున్న పాములు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో ఐదడుగుల భారీ తాచుపాము ప్రత్యక్షమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గణపవరం గ్రామానికి చెందిన అంజిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా, ఒక్కసారిగా ఐదడుగుల పొడవున్న తాచుపాము కనిపించింది. బుసలు కొడుతూ సంచరిస్తున్న ఆ విష సర్పాని చూసి అంజిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన, స్థానిక స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ అత్యంత విషపూరితమైన ఆ త్రాచుపామును ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బంధించారు. పామును పట్టుకునే క్రమంలో అది పడగ విప్పి స్నేక్‌క్యాచర్‌పై దాడిచేసేందుకు యత్నించింది. అయినప్పటికీ పామునుంచి తప్పించుకుంటూ జాగ్రత్తగా దానిని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిచారు. దీంతో అంజిరెడ్డి కుటుంబంతో పాటు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు పర్యావరణ సమతుల్యతకు ఎంతో దోహదపడతాయని, పాములు కనిపిస్తే వాటిని చంపకుండా వెంటనే తమకు సమాచారం ఇస్తే, వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేస్తామని స్నేక్‌ క్యాచర్‌ మల్లికార్జున తెలిపారు. అనంతరం, పట్టుకున్న తాచుపామును జనసంచారం లేని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సురక్షితంగా వదిలిపెట్టారు. సకాలంలో స్పందించి పామును పట్టుకున్న మల్లికార్జునను గ్రామస్థులు అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

Mega 158: చిరంజీవి తేల్చేసారు.. ముహూర్తం అప్పుడే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *