Business Idea: లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్ ఐడియా!

Business Idea: లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్ ఐడియా!


Business Idea: లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్ ఐడియా!

Business Idea: తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో భారీ లాభాలను ఆర్జించాలని చూస్తున్నారా? అయితే ‘తేనెటీగల పెంపకం’ (Apiculture) మీకు ఒక అద్భుతమైన అవకాశం. బీహార్‌లోని పశ్చిమ చంపారణ్ వంటి ప్రాంతాల్లో రైతులు ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల రూపాయలు గడిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ లాభదాయకమైన వ్యాపారం గురించి పూర్తి వివరాలు మీకోసం.

తేనెటీగల పెంపకం ఎలా జరుగుతుంది?

తేనెటీగల పెంపకం అనేది ప్రకృతితో ముడిపడి ఉన్న వ్యాపారం. దీనికోసం ప్రత్యేకంగా ఆహారం పెట్టాల్సిన అవసరం ఉండదు. పండ్ల తోటలు, పూల మొక్కలు ఉన్న వాతావరణంలో తేనెటీగల పెట్టెలను (Bee Boxes) ఉంచితే సరిపోతుంది. తేనెటీగలు బయటకు వెళ్లి పూల నుండి మకరందాన్ని సేకరించి, తిరిగి పెట్టెల్లోని ‘కోంబ్స్’ (Combs) లో తేనెను నింపుతాయి.

పెట్టుబడి వివరాలు:

వ్యాపార నిపుణుల లెక్కల ప్రకారం, వ్యాపారాన్ని కమర్షియల్ గా మొదలుపెట్టడానికి 50 పెట్టెలు సరిపోతాయి. ఒక్కో తేనెటీగల పెట్టె ధర సుమారు రూ. 4,000 ఉంటుంది. 50 పెట్టెలకు రూ. 2 లక్షలు అవుతుంది. ఇక ఖర్చు విషయానికొస్తే.. సంవత్సరం పొడవునా పర్యవేక్షణ, వర్షాకాలంలో తేనెటీగలకు ఇచ్చే ఆహారం కోసం మరో రూ. 50,000 ఖర్చవుతుంది. మొత్తం పెట్టుబడి సుమారు రూ. 2.5 లక్షలు.

ఆదాయం ఎలా ఉంటుంది?

దిగుబడి: ఈ 50 పెట్టెల ద్వారా నెలకు సుమారు 100 నుండి 250 కిలోల వరకు తేనెను సేకరించవచ్చు. మార్కెట్‌లో నాణ్యమైన తేనె కిలో ధర రూ. 500 నుండి రూ. 1000 వరకు పలుకుతోంది.

వార్షిక సంపాదన: ఏడాదిలో 8 నెలల పాటు తేనె సేకరణ జరుగుతుంది. దీని ద్వారా సగటున 1200 కిలోల తేనెను పొందితే, కనీస ధర రూ. 500 చొప్పున వేసుకున్నా రూ. 6 లక్షల ఆదాయం వస్తుంది. అదే మంచి ధర దొరికితే రూ. 12 లక్షల వరకు సంపాదించవచ్చు.

సీజన్: అక్టోబర్ నుండి మే నెల వరకు తేనె ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో (ఆవాల పంట సమయంలో) దిగుబడి రెట్టింపు అవుతుంది. ఇక జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం వల్ల తేనెటీగలు బయటకు వెళ్లలేవు. ఆ సమయంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తేనెటీగలకు సరైన వాతావరణం కల్పించడం, వ్యాధులు సోకకుండా చూసుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన పని. ఈ వ్యాపారం చేయాలని అనుకుంటే మీరు సమీపంలోని వ్యవసాయాధికారులను సంప్రదించడం ద్వారా ఈ వ్యాపారంపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల గురించి కూడా సమాచారం పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *