Washington Sundar : రైట్ టైమ్ లో రైట్ ఇన్నింగ్స్.. 9 ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్

Washington Sundar : రైట్ టైమ్ లో రైట్ ఇన్నింగ్స్.. 9 ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్


Washington Sundar : రైట్ టైమ్ లో రైట్ ఇన్నింగ్స్.. 9 ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్

Washington Sundar : ఐపీఎల్ 2026 సీజన్ అనేక రికార్డులకు వేదికవుతోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్, మన తెలుగు కుర్రాడు వాషింగ్టన్ సుందర్ తన కెరీర్‌లో ఒక అపురూపమైన మైలురాయిని చేరుకున్నాడు. 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఐపీఎల్‌లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్ ఆడిన ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, విమర్శకుల నోళ్లు మూయించింది.

వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ ప్రయాణం 2017లో మొదలైంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టిన ఈ ఆటగాడు, ఇప్పటివరకు 69 మ్యాచ్‌లు ఆడాడు. రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ నుంచి ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ మీదుగా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇన్ని ఏళ్లలో బంతితో మ్యాజిక్ చేసినా, బ్యాట్‌తో మాత్రం 50 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. గత సీజన్‌లో 49 పరుగుల వద్దే అవుటై దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ, ఈసారి ఢిల్లీపై మాత్రం ఎక్కడా తగ్గలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 79 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది నంబర్ 4లో వచ్చిన సుందర్, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 33 బంతులు ఆడిన సుందర్.. 6 ఫోర్లు, 2 కళ్లు చెదిరే సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు భారీ స్కోరు సాధించడంలో వెన్నెముకగా నిలిచాడు.

సుందర్ తన ఆఫ్-స్పిన్ బౌలింగ్ ద్వారా ఎన్నో వికెట్లు తీసి జట్టుకు విజయాలను అందించాడు. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో అతను దిట్ట. అయితే, బ్యాటర్ గా అతనికి రావాల్సిన గుర్తింపు ఈ ఇన్నింగ్స్ తో లభించింది. సాధారణంగా బ్యాటింగ్ లో చివర్లో వచ్చి కొన్ని బంతులే ఆడే అవకాశం వచ్చేది. కానీ ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 588 పరుగులు చేసిన సుందర్, ఇప్పుడు తన మొదటి 50+ స్కోరును నమోదు చేయడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Gujarat Titans (@gujarat_titans)

సుందర్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 4 వేర్వేరు జట్ల తరపున ఆడాడు. ఏ జట్టులో ఉన్నా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. 69 మ్యాచ్‌ల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఒక స్థిరమైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను ఒక కీలకమైన ఆల్ రౌండర్ గా మారాడు. తన బ్యాటింగ్ లోని పదునుని ఈ హాఫ్ సెంచరీతో నిరూపించుకున్నాడు. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే, రాబోయే టి20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *