
దైవసన్నిధిలో హుండీ లెక్కిస్తూనే సిబ్బంది చేతివాటం చూపిస్తున్న రోజులివి. అలాంటిది ఓ చిరుద్యోగి ఆలయ ప్రాంగణంలో దొరికిన బంగారు బ్రేస్‌లెట్‌ను తిరిగి బాధితులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఇలా దొరికిన బంగారం తిరిగి ఇవ్వడంతపై అందరూ అభినందిస్తున్నారు. జనగామ జిల్లా కుందారం గ్రామానికి చెందిన సతీష్ అనే భక్తుడు సోమవారం తన కుటుంబంతో కలిసి వేములవాడ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన చేతికున్న నాలుగు తులాల బంగారు బ్రేస్‌లెట్ ప్రమాదవశాత్తూ జారి పడిపోయింది. దాని విలువ లక్షల్లో ఉంటుంది. అది అక్కడ విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్ స్వీపర్ డప్పు నాగమణి కంటపడింది. చిరుద్యోగి అయినప్పటికీ, నాగమణి ఆ బంగారంపై ఆశపడలేదు. ఆ నగను వెంటనే తీసుకెళ్లి ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌శర్మ, ఎస్‌పీఎఫ్ సిబ్బందికి అందజేశారు. అదే సమయంలో నగను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన సతీష్ కుటుంబ సభ్యులను అధికారులు విచారించి, అది వారిదేనని ధ్రువీకరించుకున్నారు. నగను పోగొట్టుకున్న భక్తులకు స్వయంగా నాగమణి చేతుల మీదుగానే అధికారులు దానిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మరియు ఇతర అధికారులు ఆమెను శాలువాతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు. ‘నగ దొరకగానే నాది కాదనిపించింది.. అది పోగొట్టుకున్న వారు ఎంత బాధపడతారో’ అని మాత్రమే ఆలోచించాను అని నాగమణి పేర్కొనడం అందరినీ కదిలించింది. ఒక సామాన్య మహిళ చూపిన ఈ అసాధారణ నిజాయతీ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు
ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?
LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ
గ్యాస్ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత