LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ

LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ


LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ

ఇరాన్‌-ఇజ్రాయెల్‌,అమెరికా యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై ప్రభావం చూపుతోంది. మధ్య ప్రాచ్యం నుంచి భారత్ కు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అంచుకు చేరుకున్నాయి. తమిళనాడులో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం పట్ల చెన్నై హోటల్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించి, గ్యాస్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ ఇండస్ట్రీ కుదేలవుతోందని వారు లేఖలో పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, హాస్పిటల్స్, హాస్టల్స్ మరియు ఐటీ పార్కులకు ఆహార సరఫరా చేసే కేటరింగ్ విభాగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరైన సమయంలో గ్యాస్ అందకపోతే నిత్యం లక్షలాది మందికి భోజన వసతి కల్పించడం అసాధ్యమని వారు స్పష్టం చేశారు. తమిళనాడుకు వచ్చే పర్యాటకులు, రైలు మరియు విమాన ప్రయాణికులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అసోసియేషన్ హెచ్చరించింది. గ్యాస్ కొరత వల్ల హోటల్ బుకింగ్స్ దెబ్బతినడమే కాకుండా, ప్రజల సాధారణ జీవనంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్‌పీజీని (LPG) అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని చెన్నై హోటల్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గ్యాస్‌ కంపెనీలు వెంటనే స్పందించి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ఇండస్ట్రీకి ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం గ్యాస్ సరఫరా అందేలా చూడాలని కోరారు. ఈ సంక్షోభం సామాన్య ప్రజలపై భారం పడకముందే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, చమురు సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని చెన్నై హోటల్స్ అసోసియేషన్ ప్రధానిని కోరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత

ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..

Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌

భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??

Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *