రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..


రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న కోరిక తీరలేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు .. నిండు ప్రాణాలను తీసుకున్నాడు.. ఈ షాకింగ్ కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామంలో జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల ప్రకారం.. గోపాలపూర్ గ్రామానికి చెందిన రిత్విక్ (17) అనే బాలుడు చదువుకుంటూ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. అయితే ప్రస్తుతం పంట సాగు కొనసాగుతున్నందున చేతిలో డబ్బులు లేవని, పంట డబ్బులు వచ్చిన వెంటనే బైక్ కొనిస్తానని తండ్రి అతడిని నచ్చజెప్పాడు.

అయితే, అడిగిన వెంటనే బైక్ కొనివ్వలేదనే రిత్విక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆవేదనలో ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు ఆశతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన రిత్విక్ చివరకు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొద్దిరోజులు ఆగితే బైక్ కొనిస్తానని చెప్పినా వినలేకపోయాడు అంటూ.. తల్లిదండ్రులు వినిపిస్తున్న తీరు అందర్నీ కలచి వేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *