Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి ఆ రోజే..

Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి ఆ రోజే..


Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి ఆ రోజే..

ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు సాయం విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 13వ తేదీన వీటిని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులతో కలిసి ఏపీ ప్రభుత్వం మరికొంత అందిస్తోంది. పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుభీభవ సొమ్మును రైతులకు జమ చేస్తోంది. ఈ నెల 13వ తేదీన పీఎం కిసాన్ సొమ్మును ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దీంతో అదే రోజు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను అందించనుంది.

అకౌంట్లోకి రూ.6 వేలు

పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు కలిపితే మొత్తం రూ.6 వేలు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. పీఎం కిసాన్ కేంద్రం జమ చేయనుండగా.. ఏపీ ప్రభుత్వం నుంచి రూ.4 వేలు అందనున్నాయి. మార్చి 13న ఇవి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అస్సాంలోని గౌహతిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం రూ.14 వేలు అందిస్తుండగా.. పీఎం కిసాన్ కింద రూ.6 వేలు వస్తోంది. ఇలా ప్రతీ ఏడాది మొత్తం రైతులకు రూ.20 వేలు అందుతోంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఫిబ్రవరిలోనే ఈ నగదును ఏపీ ప్రభుత్వం అందించాల్సి ఉండగా.. పీఎం కిసాన్ విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో జాప్యం జరిగింది.

కుటుంబానికి ఒక్కరికీ..

కుటుంబంలో ఇద్దరి వ్యక్తి పేర్లపై పోలం ఉంటే ఒక్కరికి మాత్రమే అన్నదాత సుఖీభవ కింద అర్హత పొందేే అవకాశముంది. ఒకే కుటుంబంలో ఇద్దరి వ్యక్తులకు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పధకం కింద లబ్ది పొందాలంటే చిన్న, సన్నకారు రైతు అయి ఉండాలి. ఎక్కువ పోలం ఉన్నవారికి పథకం వర్తించదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు,  ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఇవ్వరు.  గ్రామ, వార్డు సచివాలయంలో ఈ పథకం కింద లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదారు పాసు బుక్, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ వంటివి అందించాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *